ధోనీకి ఏమిస్తే సరిపోతుంది

ms dhoni & Sourav Ganguly
ms dhoni & Sourav Ganguly

న్యూఢిలీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ గురించి రోజు ఏదొక వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది. కాగా బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్‌ గంగూళీ ధోని రిటైర్మెంట్‌ గురించి స్పందించారు. భారత క్రికెట్‌ కు ధోనీ అందించిన సేవలు అసామాన్యం అని, అలాంటి గొప్ప క్రికెటర్‌ కు కేవలం కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలకలేమని ఆయన వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్‌ విషయాన్ని ధోనికే వదిలేద్దామని అన్నారు. భారత క్రికెట్‌ కు ఎనలేని సేవలు అందించిన లెజెండరీ క్రికెటర్లకు సముచిత గౌరవం ఇద్దామని పేర్కొన్నారు. ధోని విషయం టీమిండియా సెలక్టర్లు, జట్టు అధికారులు చూసుకుంటారని గంగూళీ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/