లీ చోంగ్ వీ రికార్డును బద్దలు కొట్టిన కెంటో

Kento Momota
Kento Momota

హైదరాబాద్: ప్రపంచ నంబర్‌వన్, స్టార్ షట్లర కెంటో మొమోటా (జపాన్‌) , గ్రేట్ లీ చోంగ్ వీ(మలేసియా) రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి అరుదైన రికార్డుని నెలకొల్పాడు. బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే ఏడాదిలో 11 టైటిల్స్‌ నెగ్గిన తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గ్రేట్ లీ చోంగ్ వీ(మలేసియా), వాంగ్‌ జియోలి-యు యాంగ్‌(చైనా) 10 టైటిళ్ల రికార్డుని అధిగమించాడు. 2019లో అతడు వరుసగా చైనా మాస్టర్స్, డెన్మార్క్‌ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, జపాన్‌ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్‌, సింగపూర్‌ ఓపెన్, ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్, జర్మన్‌ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్‌ ఆంథోనీని మట్టికరిపించి ఈ ఘనత సాధించాడు. 87 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 17-21, 21-17, 21-14 తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాడు. ఫలితంగా ఈ ఏడాది మొమోటా 12 టోర్నీల్లో ఫైనల్స్‌ చేరగా 11 టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/