ఆరోగ్యంగానే ఉన్నాను: బ్రియాన్‌ లారా

Brian Lara
Brian Lara, west indies ex cricketer


ముంబై: అస్వస్థతకు గురైన వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఈ మేరకు లారా స్వయంగా చెప్పిన వాయిస్‌ మెసేజ్‌ను క్రికెట్‌ వెస్టిండీస్‌ విదుదల చేసింది. ముంబైలోని ఓ కార్యక్రమానికి హాజరైన లారాకు ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబైలోని పరేల్‌ ప్రాంతంలో గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/