శిఖర్‌ ధావన్‌ను ట్రోల్‌ చేసిన భువనేశ్వర్‌

shikhar dhawan
shikhar dhawan

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టు ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. రోహిత్‌ శర్మ 85 పరుగులు సాధించగా, శిఖర్‌ ధావన్‌ 31 పరుగుల వద్ద తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌ శర్మతో కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాల్ని అత్యధిక సార్లు నెలకొల్పిన రికార్డులో ధావన్‌ భాగమయ్యాడు. కాగా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌…ధావన్‌ను ట్రోల్‌ చేశాడు. ధావన్‌ ఒక వీడియోను రూపొందించడంతో భువీ తనదైన శైలిలో స్పందించాడు. వివరాల్లోకి వెళితే…బాలీవుడ్‌ స్టార్‌ అక్ష§్‌ు కుమార్‌ నటించిన హౌస్‌ఫుల్‌-4 చిత్రంలో ఒక సన్నివేశాన్ని యజ్వేంద్ర చాహల్‌-ఖలీల్‌ అహ్మద్‌లతో కలిసి ధావన్‌ రీక్రియేట్‌ చేశాడు. వీరు ముగ్గురూ కలిసి హోటల్లో ఈ వీడియోను రూపొందించారు. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ధావన్‌ పోస్టు చేశాడు. దీనిపై భువీ రిప్లై ఇస్తూ ధావన్‌ టాలెంట్‌పై హిందీలో కామెంట్‌ చేశాడు. యాక్టింగ్‌ను మర్చిపోయినట్లు నటించాల్సిన అవసరం ఏముంది. నీ యాక్టింగ్‌ నేచురల్‌గానే ఉంది కదా అని పేర్కొన్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/