విరాట్‌తో జాగ్రత్త!

du Plessis
du Plessis

క్వీన్స్‌లాండ్‌: ఈ నెల 21 నుంచి భారతజట్టు ఆస్ట్రేలియా పర్యటన చేయనున్నది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఆసీస్‌ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. కోహ్లిని అంత తక్కువ అంచనా వేయకూడదని, ఆయన విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని , అతనిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఆసీస్‌ జట్టుకు సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ను గుర్తు చేసుకుని ఒకింత భయానికి లోనయ్యాడు కెెప్టెన్‌ డుప్లెసిస్‌. రెండు నెలల పర్యటన కోసం టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియా చేరుకుంది.