దినేశ్ కార్తీక్ కు షోకాజ్ నోటీసులు జారీ

Dinesh Karthik
Dinesh Karthik

న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్ కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ట్రిన్ బాగో ఫ్రాంఛైజీకి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ యజమానిగా ఉన్నారు. షారుఖ్ యజమానిగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ కు దినేశ్ కార్తీక్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ కు కార్తీక్ హాజరయ్యాడు. ట్రిన్ బాగో జట్టు జెర్సీ ధరించి వారి డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో బదులివ్వాలంటూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ నోటీసులు పంపారు. బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడైన కార్తీక్ కు ఇతర లీగుల్లో ఆడే అవకాశం లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ మినహా ఇతర లీగుల్లో ఆడరాదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/