బంగ్లాదేశ్‌ 106 పరుగులకే ఆలౌట్‌

india vs bangladesh
india vs bangladesh

కోల్‌కతా: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు క్రికెట్‌ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. గులాబీ బంతితో ఇషాంత్‌ శర్మ 5/22 చెలరేగడంతో బంగ్లాదేశ్‌ కుప్పకూలింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ షాద్మాన్‌ ఇస్లామ్‌ 29, లిటన్‌ దాస్‌ 24, నయీమ్‌ హసన్‌ 19 రాణించారు. టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌ ఎంచుకున్న బంగ్లాను ఆదిలోనే ఇషాంత్‌ శర్మ దెబ్బతీశాడు. బంగ్లా కీలక బ్యాట్స్‌మెన్‌ ముష్ఫికర్‌, హహ్మదుల్లా 6 ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడంతో బంగ్లా 38 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌ వచ్చిన లిటన్‌ దాస్‌ 24తో కలిసి షాద్మాన్‌ కొద్దిసేపు పోరాడాడు. షమి వేసిన బౌన్సర్‌ లిటన్‌ తలకు బలంగా తగలడంతో అతడు లంచ్‌ విరామానికి రిటైర్‌హర్ట్‌గా వెనుతిరిగాడు. లంచ్‌ విరామం తర్వాత బంగ్లా బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు నిలవలేపోయారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/