భజరంగ్‌కు అన్యాయం?

bajarag punia
bajarag punia


నూర్‌ సుల్తాన్‌ (కజక్‌స్థాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత కుస్తీవీరుడు భజరంగ్‌ పునియాకు అన్యాయం జరిగింది. వివాదాస్పదంగా సాగిన 65 కిలోల సెమీస్‌పోరులో మ్యాచ్‌ రిఫరీ ప్రత్యర్థివైపే మొగ్గుచూపాడని సమాచారం. ఉద్దేశపూర్వకంగానే పునియాను ఓడించారని తెలుస్తోంది. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో స్థానిక ఆటగాడు దౌలత్‌ నియజ్‌బెకోవ్‌తో భజరంగ్‌ పోటీపడ్డాడు. చివరి ఆరు నిమిషాలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పోరాడటంతో మ్యాచ్‌ ముగిసేతటప్పటికి స్కోర్లు 9-9తో సమం అయ్యాయి. ఆగ్రహంతో భజరంగ్‌ కోచ్‌ షేక్‌ బెనిటిడిస్‌ కోచ్‌ల బ్లాక్‌ను కాలితో తన్ని వెళ్లిపోయాడు. ఇద్దరి స్కోర్లు సమం అయినప్పటికీ పోరాటంలో నియజ్‌బెనోవ్‌ ఒకే దఫాలో 4 పాయింట్లు సాధించడంతో రిఫరీ అతడినే విజేతగా ప్రకటించాడు.

తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/