సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మరో షాక్‌

sarfaraz ahmed
sarfaraz ahmed, pakistan captain

కరాచి: పాక్‌ వన్డే సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మరో షాక్‌ తగలనుంది. ఇప్పటికే టెస్టు, టీ20ల్లో కెప్టెన్సీ కోల్పోయిన సర్ఫరాజ్‌. టీ20 కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌కు వన్డే సారథిగా పాక్‌ క్రికెట్‌ బోర్డు బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక వన్డేకు అతడు సారథి బాధ్యతలు అందుకునే అవకాశం ఉంది. అయితే సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్‌ టెస్టు, టీ20 జట్టులో ఇప్పటికే చోటు కోల్పోయాడు. ఎన్నో ఏళ్లుగా పాక్‌కు బ్యాట్స్‌మన్, కీపర్‌, కెప్టెన్‌గా సేవలందిస్తున్న అతడిని వన్డేల్లో సారథిగా కొనసాగించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాటింగ్‌లో రాణిస్తున్న బాబర్‌కే అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని పాక్‌ మాజీ క్రికెటర్‌ రమిజ్‌ అంటున్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/