హెచ్‌సిఏ అధ్యక్ష బరిలో అజహర్‌…

azharuddin
azharuddin


హైదరాబాద్‌: రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఏ) అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సిఎ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు అజహర్‌. ఈనెల 27వ తేదీన జరగనున్న హెచ్‌సిఎ ఎన్నికల్లో భాగంగా గురువారం అజహర్‌ నామినేషన్‌ వేశారు. హెచ్‌సిఏ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. దాంతోనే అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశా. ప్రతి ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్‌ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నాకు విక్రమ్‌ మాన్‌సింగ్‌తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్‌ అయూబ్‌, శివలాల్‌ యాదవ్‌లు సహకారం ఉందని అజహర్‌ తెలిపారు. కాగా, మాజీ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఆర్‌పి మాన్‌సింగ్‌ కుమారుడు విక్రమ్‌ మాన్‌సింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నారు.

తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/