ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కు కరోనా!

దక్షిణాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత గొంతు ఇన్ఫెక్షన్

australian cricketer kane richardson
australian cricketer kane richardson

సిడ్నీ: కరోనా రోజురోజుకూ పంజా విసురుతుంది. తాజాగా ఆస్టేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారులు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సౌతాఫ్రికా టూర్ తిరిగి వచ్చిన తర్వాత గొంతు నొప్పితో రిచర్డ్ సన్ బాధపడ్డాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని క్వారంటైన్ గదికి తరలించారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, రిచర్డ్ సన్ కు వచ్చిన గొంతు ఇన్ఫెక్షన్ ను చాలా తీవ్రమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధలను తాము పాటిస్తున్నామని… ఇతర టీమ్ సభ్యులకు దూరంగా అన్ని ఉంచామని తెలిపారు. రిచర్డ్ సన్ కోలుకున్న తర్వాత అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటామని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/