3 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌

AUSTRALIA vs ENGLAND
AUSTRALIA vs ENGLAND

బర్మింగ్‌హామ్‌: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కసిగా బౌలింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆసీస్‌ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ ఆర్చర్‌ బౌలింగ్‌లో డకౌట్‌ కాగా, వార్నర్‌ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్‌ గంటకు 145 కి.మీ.లకు పైగా వేగంతో బంతులు విసురుతూ కంగారూలను హడలెత్తిస్తున్నారు. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో వార్నర్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌ ఔటయ్యారు. ఆసీస్‌ 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్‌ స్మిత్‌(2), అలెక్స్‌ క్యారీ(8)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/