ఆసియా కప్‌ 2020 రద్దు?!!

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ఇషాన్‌ మణి అభిప్రాయం

asia cup
asia cup

కరాచి: కరోనా మహామ్మారి కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు రద్దు అవగా.. మరికోన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్‌ 2020 టోర్నీ కూడా రద్దయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మెన్‌ ఇషాన్‌ మణి ఓ ప్రకటనలో తెలిపారు. టోర్నీ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కాని ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోంటుంది. ఇప్పటికే పలు టోర్నీలు రద్దు అయ్యాయి. అదే కోవలోకి ఆసియా కప్‌ 2020 కూడా చేరే అవకాశం ఉంది అని ఇషాన్‌ మణి అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం కిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/