క్రికెటర్ మహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్

Mohammed Shami
Mohammed Shami

కోల్‌కత్తా: భారత క్రికెట్ జట్టు ప్రధాన పేస్ బౌలర్ మొహమ్మద్‌ షమీపై అరెస్ట్‌ వారెంట్‌ ను కోర్టు జారీ చేసింది. అతని భార్య హసీన్‌ జహాన్‌ దాఖలు చేసిన గృహ హింస ఫిర్యాదుపై, అలీపూర్‌ కోర్టు న్యాయమూర్తి షమీతో పాటు అతని సోదరుడు హసీద్‌ అహ్మద్‌ పైనా వారెంట్ ఇష్యూ చేశారు. వీరిద్దరూ 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అంతే గడువు ఇస్తున్నట్టు తెలిపారు.

కాగా, గత సంవత్సరం తన భర్త షమీ వేధిస్తున్నాడని హసీన్ జహాన్, కోల్‌ కతా పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద షమీతోపాటు అతని సోదరుడిపైనా విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో షమీ ఆడుతుండగా, చార్జ్‌ షీట్‌ ను పూర్తిగా పరిశీలించిన తరువాతే షమీపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/