సీనియర్‌ టీ20 లీగ్‌ మ్యాచుల్లో అర్జున్‌ టెండూల్కర్‌….

ముంబై: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ లెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ సీనియర్‌ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. ఇన్నాళ్లూ అండర్‌ 19 తరుపున క్రికెట్‌ ఆడుతూ వచ్చిన అర్జున్‌…ఇక టీ20 ముంబై లీగ్‌ మ్యాచుల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. టీ20 ముంబై లీగ్‌ మ్యాచ్‌ల కోసం త్వరలో వేలం పాటలను నిర్వాహకులు నిర్వహించబోతున్నారు. ఈ టీ20 మెగా టోర్నమెంట్‌లో ఆడటానికి అర్జున్‌ టెండూల్కర్‌ సన్నాహాలు చేస్తున్నాడు. టీ20 ముంబై లీగ్‌ మ్యాచుల్లో ఆడటానికి తన పేరును ఇచ్చాడు. త్వరలో నిర్వహించే వేలం పాట సందర్భంగా అర్జున్‌ టెండూల్కర్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఎడమచేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ అర్జున్‌ గత ఏడాది శ్రీలంకతో భారత్‌ తరుపున రెండు అండర్‌-19 టెస్టులు ఆడాడు. వేలంలో అర్జున్‌ పేరు రానుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంఇ. డివై పాటిల్‌ టీ20 టోర్నీతో పాటు ముంబై అండర్‌-23 టీమ్‌ తరుపున కూడా ఆడాడు.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/