అఫ్గానిస్తాన్‌ పై వెస్డిండీస్‌ విజయం

Shai Hope
Shai Hope

లఖ్‌నవూ: హోప్‌ శతకంతో చెలరేగగా ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్థాన్‌ను వెస్టిండీస్‌ చిత్తుచేసి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విండీస్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గాన్‌..అస్గన్‌ (86), హజ్రతుల్లా(50), మహ్మాద్‌నబీ(50), అర్ధశతకాలతో రాణించగా ఏడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బౌలర్లలో కీమోపాల్‌ (3-44), అల్జారీ జోసెఫ్‌ (2-59) సత్తా చాటారు. అనంతరం బరిలోకిదిగిన వెస్టిండీస్‌ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ముజీబ్‌ ధాటికి (2-49) నాలుగు పరుగులకే వెస్టిండీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. అయినా హోఫ్‌ అఫ్గాన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టును గెల్పించాడు. వెస్టీండీస్‌ బ్యాట్స్‌మెన్‌లో ఛేజ్‌(42), బ్రాండన్‌(39), పొలార్డ్‌ (32) రాణించారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/