రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌ అన్య ఖురానా

హైదరాబాద్‌: లెజెండ్‌ హంట్‌ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో అన్య ఖురానా విజేతగా నిలిచింది. ఇందిరా పార్క్‌లోని స్కేటింగ్‌ రింక్‌ వేదికగా జరిగిన 9-1బాలికల ఫైనల్‌లో అన్య అగ్రస్థానాన్ని దక్కించుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రోల్‌ హాక్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈటోర్నీలో రిధి పటేల్‌ రజతాన్ని సొంతం చేసుకోగా…నమితా నిరెల్‌ ఆడమ్స్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. బహుమతి ప్రధాన కార్యక్రమంలో భారత రోలర్‌ స్కేటింగ్‌ సమాఖ్య ప్రతినిధి అమిత్‌ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.

https://www.vaartha.com/news/sportsమరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.