ధోనీ ఖాతాలో మరో రికార్డు…

MS DHONI
MS DHONI

జైపూర్‌ వేదిగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ మహేంద్రసింగ్‌ ధోని అరుదైన రికార్డుని తనఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్‌ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ హాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు ఐపిఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది వందో విజయం కావడం విశేషం. కెప్టెన్‌గా ధోని 100విజయాల మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్‌లో కెప్టెన్‌గా మొత్తం 166 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన మహేంద్రసింగ్‌ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ 65మ్యాచుల్లో ఓడిపోగా….ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/