మూడో టెస్టుకు ఆండర్స్‌న్‌ దూరం

James Anderson
James Anderson

హెడింగ్లీ : యాషెస్‌ మూడో టెస్టుకూ జేమ్స్‌ అండర్సన్‌ దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి టెస్టు మధ్యలోనే అర్ధాంతరంగా తప్పుకున్న ఆండర్సన్‌, లార్డ్స్‌ టెస్టులోనూ ఆడలేదు. అయితే మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. 22 నుంచి హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసిబి) 12 మంది సభ్యులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. అయితే ఆండర్సన్‌ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని, దీంతో అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని భావించినట్లు ఈసిబికి చెందిన ఓ అధికారి తెలిపాడు.

మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు :

జో రూట్‌(కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టో, స్టువార్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, స్యామ్‌ కుర్రన్‌, డెన్లీ, జాక్‌ లీచ్‌, జేసన్‌ రారు, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/