ప్రపంచ నంబర్‌ వన్‌ బాక్సర్‌గా అమిత్‌ పంఘాల్‌

amit panghal
amit panghal

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత బాక్సర్, ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అమిత్‌ పంఘాల్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. 52 కేజీల విభాగంలో 420 పాయింట్లతో అమిత్‌ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో 2009 అనంతరం బాక్సింగ్‌లో నంబర్‌వన్‌ ర్యాంకును దక్కించుకున్న తొలి భారత బాక్సర్‌గా నిలిచాడు. గతంలో విజేందర్‌ సింగ్‌ (75 కేజీలు) వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన మేరీ కోమ్‌ 51 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలవగా… తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 22వ ర్యాంకును సాధించింది. మహిళల 69 కేజీల విభాగంలో లొవ్లీనా బొర్గోహైన్‌ మూడో ర్యాంకును దక్కించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/