గంభీర్‌పై మరోసారి ఆఫ్రిది ఘాటువ్యాఖ్యలు

Shahid Afridi
Shahid Afridi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది తన ఆత్మకథలో గంభీర్‌ గురించి ప్రస్తావిస్తూ.. అతనికి కావాల్సినంత పొగరు ఉంది. కానీ, ఆటలో గొప్ప రికార్డేమీ లేదని పేర్కొన్నాడు. గంభీర్‌కు అసలు వ్యక్తిత్వమే లేదుగ అని రాసుకొచ్చాడు. అయితే, ఆ తర్వాత గంభీర్‌ కూడా ఘాటుగానే స్పందించాడు. ఈ వ్యాఖ్యలపై గంభీర్‌ స్పందిస్తు నువ్వో తమాషా వ్యక్తివి. అది సరే కానీ.. పాకిస్థానీయులకు మా దేశం ఇంకా వైద్య పరమైన వీసాలు జారీ చేస్తూనే ఉంది. నువ్వు వచ్చావంటే నేనే వ్యక్తిగతంగా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాగ అని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. అయితే గంభీర్‌ ట్వీట్‌పై అఫ్రిది ఇలా స్పందించాడు. గంభీర్‌కు నిజంగా మతిస్తిమితం సరిగా లేదు. అతను మా దేశం వస్తే నా ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా చికిత్స చేయిస్తా. ఒకవేళ అతనికి వీసా సమస్య వస్తే. నేను దగ్గరుండి వీసా ఇప్పిస్తా అని అఫ్రిది అన్నాడు.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/news/sports/