అభినవ్‌ బింద్రాకు అత్యున్నత పురస్కారం

ABINVBINDRA
ABINVBINDRA

అభినవ్‌ బింద్రాకు అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ : భారత స్టార్‌ షూటర్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ అభినవ్‌ బింద్రా కు అరుదైన గౌరవం దక్కింది. షూటింగ్లఓ అత్యు న్నత పురస్కారమైన బ్లూక్రాస్‌ను బింద్రా అందుకు న్నాడు. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడాసమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) అథ్లెటిక్స్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో అత్యుత్తమ సేవలు అందించినం దుకుగాను బింద్రాను బ్లూ క్రాస్‌ అవార్డు వరించింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఈ అవార్డును బింద్రాకు అందజేసింది. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున ఏకైక భారతీయుడిగా 36 ఏళ్ల బింద్రా రికార్డులకెక్కాడు. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ అత్యుత్తమ అవార్డు అందుకోవడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నా అని బింద్రా ట్వీట చేశాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన బింద్రా… 2014నుంచి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ అథ్లెటిక్స్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు.