చరిత్ర సృష్టించిన అభిమన్యు మిథున్
ఒకే ఓవర్లో 5వికెట్లు, అందులో హ్యాట్రిక్

సూరత్: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ అరుదైన రికార్డు సాధించాడు. కళ్లు చెదిరే ప్రదర్శనతో ఒక ఓవర్లో ఐదు వికెట్లు తీసి అబ్బురపరిచాడు. తద్వారా టీ20 చరిత్రలో ఆరు బంతుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ ట్రోఫిలో భాగంగా హరియాణాతో నిన్న జరిగిన సెమీఫైనల్లో 30 ఏళ్ల మిథున్ ఈ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. చివరిదైన 20వ ఓవర్లో అతడు వరుసగా నాలుగు బంతుల్లో హిమాన్షు రాణా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రాలను పెవిలియన్‌కు చేర్చాడు. ఇక చివరి బంతికి జయంత్ యాదవ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కీపర్ రాహుల్ పట్టెయడంతో మిథున్ సంబరాల్లో మునిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హరియాణా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో కర్ణాటక 15 ఓవర్లలో రెండు వికెట్లకు 195 పరుగులు చేసింది. దేవదత్త 87 రాహుల్ 66 అర్థసెంచరీలు చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/