పాక్‌ ఓటమిపై అంతటా విమర్శలే

pakistan cricket team
pakistan cricket team

ఇస్లామాబాద్‌: ఇటీవల పాకిస్థాన్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ ముగిసింది. చాలాకాలం వరకు ఈ దేశంలో విదేశీయులతో క్రికెట్‌ జరగలేదు. అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్థాన్‌ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. భద్రతా కారణాల వల్ల స్టార్‌ ఆటగాళ్లు పాక్‌ పర్యటనకు రాకపోయినప్పటికీ శ్రీలంక యువ క్రికెటర్లు పాక్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సహా హెడ్‌కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చెబుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఆమిర్‌ సోహైల్‌ కూడా పాక్‌ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. అయితే క్రికెట్‌కు తక్కువ కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్‌ లేదా డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలకు సిద్ధ అవుతున్నారో అర్ధం కావడం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/