35/3 నుంచి 35 పరుగులకే ఆలౌట్‌.

RANJI--
RANJI–

35/3 నుంచి 35 పరుగులకే ఆలౌట్‌.

రంజీ క్రికెట్‌లో వింత ఘటన

న్యూఢిల్లీ: 35పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క పరుగు కూడా జోడించకుండా ఆలౌటైంది. ఈ వింత ఘటన ఆంధ్ర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 23 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా చేయకుండా మధ్యప్రదేశ్‌ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. మరో బ్యాట్స్‌మెన్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. క్రికెట్‌లో ఇలాంటి వింత ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌….కేవలం 35 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ 307 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌… ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులు చేయగా…మధ్యప్రదేశ్‌ 91 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ 301 పరుగులు చేయగా, మధ్య ప్రదేశ్‌ 35 పరుగులు చేసి దారుణంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ జట్టులోని చివరి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌటయ్యారు. ఈమ్యాచ్‌లో మొత్తం ఎనిమిది మంది డకౌట్లు అయ్యారు. మధ్యప్రదేశ్‌ తరుపున ఆర్యమన్‌ బిర్లా (12), యశ్‌దూబె (16) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ బౌలర్లలో 18 పరుగుల్చి ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో బౌలర్‌ విజ§్‌ుకుమార్‌ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరుపున ఆరు వికెట్లు తీసిన గిరినాథ్‌ రెడ్డికి రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ వేసే అవకాశం రాలేదు. అయితే, రంజీ క్రికెట్‌లో ఇదే అత్యల్పస్కోరు కాదు. 2010-11 రంజీ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 21పరుగులకే ఆలౌటైంది.