2020 వరకు ఇదే జట్టులో కొనసాగుతా: సెర్జియా

SERJIA1
SERJIA1

2020 వరకు ఇదే జట్టులో కొనసాగుతా: సెర్జియా

మాంచెస్టర్‌: మాంచెస్టర్‌ సిటీ ఫార్వర్డ్‌ ఆటగాడు సెర్జియా అగురో 2020 వరకు తన జట్టుతోనే ఉండాలని ఆశపడుతున్నాడు. అర్జెంటీనా అంతరా ్జతీయ జట్టుకు ఎతిహాద్‌ స్టేడియం వద్ద 2020 అర్థభాగం వరకు పనిచేయాలని ఇంతకుముందే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు 17 ప్రీమియర్‌ లీగ్‌లు ఆడిన అగురో మ్తొంగా 13 గోల్‌లు సాధించాడు. నాకు మేనేజర్‌ పెప్‌ గార్డి యోలాతో ఎటువంటి విభేదాలు లేవు. ఇంకా నాకే ఆయన భవిష్యత్‌పై అనుమానంగా ఉంది.

వాట్‌ ఫర్డ్‌ 3-1తేడాతో గెలుపొందిన అనంతరం అగురో మీడియాతో ఒప్పందం ప్రకారం…నేను 2020 వరకు ఇదే జట్టులో కొనసాగుతానన్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ సీజన్‌ చివరి వరకుతన వల్ల అయినంత కష్టపడతానని పేర్కొన్నాడు.ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అసలు నా ఉద్ధేశ్యం జట్టు మారాలని కాదు. మనమెవ్వరం నిర్ణయాలు తీసుకోవడానికి జట్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటానని నమ్మకాన్ని వెలిబుచ్చాడు. ప్రస్తుత సూపర్‌లీగ్‌లో హర్రీకేన్‌(18), మొహమ్మద్‌ సలాహ్‌ (17), రహీమ్‌ స్టెర్లింగ్‌(14)లు మాత్రమే అగురో (13) కంటే ఎక్కువ గోల్‌లు చేశారు. మాంచెస్టర్‌ సిటీ మొత్తం ఆడిన 22 మ్యాచ్‌లలో 20 గెలిచింది. రెండు డ్రా అయ్యింది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌లో ఉంది.