200వ వన్డే ఆడి రికార్డు సృష్టించిన మిథాలీ

mithali raj
mithali raj

హామిల్టన్‌: చిన్న వయసులోనే క్రికెట్‌ ఆటలో ఆరంగేట్రం చేసి ఎవరికి సాధ్యంకాని ఘనతలు అందుకున్న క్రికెటర్‌ మిథాలీరాజ్‌. ఆమె ఇప్పుడు ఓ రికార్డు సృష్టించారు. మహిళల క్రికెట్‌లో 200వ వన్డే ఆడిన మహిళల క్రికెట్‌ ప్రపంచ చరిత్రలో ఈ ఘనత సాధించిది కేవలం మిథాలినే న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ ఆమెకు 200వ వన్డే. 36 ఏళ్ల మిథాలీ 51.33 సగటుతో 6622 పరుగులు చేసింది. అంతేకాక భారత్‌ ఇప్పటి వరకు 263 వన్డేలు ఆడితే అందులో 200 మ్యాచుల్లో మిథాలీ ప్రాతినిథ్యం వహించింది. 200వ మ్యాచ్‌ సందర్భంగా బీసీసీఐ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆమెను అభినందించారు.