పాముల కారణంగా మ్యాచ్‌కు అంతరాయం!

Two snakes comes in cricket stadium
Two snakes comes in cricket stadium

ముంబయి: సాధారణంగా వర్షం కారణంగానో లేదో సరైన వెలుతురు లేని కారణంగానో క్రికెట్‌ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. కానీ పాముల కారణంగా మ్యాచ్‌ చాలాసేపు ఆగిపోవడం విశేషం. ముంబై-కర్ణాటక జట్ల మధ్య ఆదివారం జరిగిన రంజీ మ్యాచ్‌లో రెండు సార్లు పాములు కలకలం సృష్టించాయి. దీంతో మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది. ముంబై-కర్ణాటక జట్ల మధ్య ఆదివారం ఆటలో భాగంగా నగరంలోని బంద్ర కుర్లా కాంప్లెక్స్‌ స్టేడియంలో రెండు పాములు రావడంతో మ్యాచ్‌ చాలాసేపు నిలిచిపోయింది. చివరకు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో వాటిని పట్టుకున్నాడు. అయితే ఇవి విషపూరితమైనవి కావని వారు తెలిపారు. పాములు కారణంగా మ్యాచ్‌ను కొంతసేపు ఆపాల్సి వచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/