102 పరుగులతో ప్రపంచ రికార్డు

SAHA-1
SAHA-1

102 పరుగులతో ప్రపంచ రికార్డు

న్యూఢిల్లీ: రెండు వారాల క్రితం నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై దినేశ్‌ కార్తీక్‌ అద్భుత బ్యాటింగ్‌ చూశాం. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన కార్తీక్‌ చివరి బంతికి సిక్సర్‌ బాది భారత్‌ను ఒంటిచేత్తో కప్‌ అందించాడు. అదే బాటలో మరో భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా చెలరేగిపోయాడు. ఐపిఎల్‌ సమీపిస్తోన్న తరుణంలో కేవలం 20 బంతుల్లోనే 102 పరగులు చేశాడు. సాహా…14 సిక్సులు, 4 ఫోర్లు బాది పరుగుల వరద పారించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ ఫార్మట్‌లోనైనా ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ కావడం విశేషం.

కోల్‌కతాలో జరిగిన టీ20 క్లబ్‌ మ్యాచ్‌లో సాహీ ఈ ఫీట్‌ సాధించాడు. జెసి ముఖర్జీ ట్రోఫీలో మోహన్‌ బగన్‌ తరుపున బరిలో దిగిన ఈ ఆటగాడు బిఎన్‌ఆర్‌ రీక్రియేషన్‌ క్లబ్‌పై దుమ్మురేపాడు. 152 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 510 స్ట్రయిక్‌ రేట్‌తో సాహా పరుగులు రాబట్టాడు. దీంతో ఈమ్యాచ్‌లో మోహన్‌ బగన్‌ జట్టు పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఏడు ఓవర్లలోనే ఆ జట్టు లక్ష్యాన్ని చేధించడం విశేషం. జనవరి చివరి వారంలో జరిగిన వేలంలో సన్‌రైజర్స్‌ యాజమన్యాం సాహాను రూ.5కోట్లకు కొనుగోలు చేసింది. ఐపిఎల్‌లో హైదరాబాద్‌ తరుపున కూడా సాహా ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే…ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకోవాల్సిందే.