హైద‌రాబాద్‌పై చెన్నై విజ‌యం

CSK
CSK

పూణెః మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ మైదానంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8వికెట్ల తేడాతో గెలుపొందింది. మొద‌ట‌ బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా, చెన్నై జట్టు 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్ మెన్లు ఓపెనర్ అంబటి రాయుడు సెంచరీతో నాటౌట్ గా నిలువగా మరో ఓపెనర్ షేన్ వాట్సన్ 57 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ ధోనీ 20 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.