హాకీ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ విజయభేరి

Asia Hockey Cup Tourney
Asia Hockey Cup Tourney

ఆసియా కప్‌ హాకీ టోర్నీలో చిరాకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై 3-1తేడాతో
భారత్‌ ఈ గెలుపు సాధించింది. దీంతో పాక్‌పై భారత్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించినట్టయింది. నేడు ఢాకాలో జరిగిన
ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంపై హాకీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెలుపుతో భారత్‌ 9
పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దింగల్‌సేన(13వ నిమిషం), రమణ్‌సింగ్‌(44వ నిమిషం), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(45వ
నిమిషం), చెరో గోల్‌ కొట్టారు. పాక్‌లో అలీషాన్‌(49వ నిమిషం) ఒక్కడే గోల్‌ చేయగలిగాడు. కాగా, ఈ సందర్భంగా హాకీ
ఇండియా ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది. భారత్‌ గెలిచిందని, పాకిస్థాన్‌పై హ్యాట్రిక్‌ విజయం సాధించిందని పేర్కొంది.