హర్మన్‌, ఇక్కడితో ఈ విషయం వదిలేయ్‌..

sanjay manjrekar
sanjay manjrekar

భారత మహిళల జట్టు కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ను కొనసాగించాలని కోరుతూ టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ బిసిసిఐకి లేఖ రాసిన విషయం విదితమే. దీనిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయి మంజ్రేకర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జట్టులో కోచ్‌ పాత్రను పెంచడానికి హర్మన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఇంతటితో ఆపితే మంచిదని అన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు సాగాలని సూచించాడు. పొవార్‌ కోచ్‌గా లేని సమయంలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కి చేరి టైటిల్‌ గెలవలేదా అని ప్రశ్నించారు. కోచ్‌ను పదవి నుంచి తీసేస్తే అక్కడి నుంచి కొత్తగా మొదలు పెట్టాలి అంతేకాని కోచ్‌ పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోకూడదు అని ఆయన అన్నారు.