సెమీ ఫైనల్లో సైనా

SAINA
వుహాన్‌ : ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ దూసుకుపోతుంది.కాగా శుక్రవారం ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో షిజియాన్‌ వాంగ్‌(చైనా)ను 21-16,21-19తో ఓడించింది. చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ సత్తా చాటుతుంది.కాగా రెండవ రౌండ్‌లో థా§్‌ులాండ్‌కు చెందిన నిచయాన్‌ జిందాపోల్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. జిందాపోల్‌పై గురువారం జరిగిన మ్యాచ్‌లో 21-14,21-18 వరుస సెట్లతో సైనా విజయం సాధించింది.క్వార్టర్స్‌లో చైనాకు చెందిన షిజియాన్‌ వాంగ్‌తో సైనా తలపడింది.