సంగక్కర టీంలో సచిన్‌కు దక్కిని స్థానం

sachin_dravid
కొలంబో  : న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కెల్లమ్‌ కలల జట్టును ప్రకటించిన తరువాత శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర తన డ్రీమ్‌ టీమ్‌ను ప్రకటించాడు. కాగా ఈజట్టులో టీమిండియా  దిగ్గజం సచిన్‌కు స్థానం కల్పించకపోవడం విశేషం. అదే సమయంలో మరో దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌కు ఎంచుకున్నాడు. ఈ మేరకు 11 మంది ఆటగాళ్లతో కూడిన డ్రీమ్‌ టీమ్‌ను వెల్లడించాడు.టీమ్‌లో సొంత జట్టు నుంచి ముగ్గురికి స్థానం కల్పించాడు. శ్రీలంక ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అరవింద్‌ డిసిల్వా, ముత్తయ్య మురళీధరన్‌, చమిందావాస్‌లకు స్థానం లభించింది. ఆస్ట్రేలియా జట్టు నుంచి రికీ పాంటింగ్‌, మాథ్యూ హెడెన్‌,ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, షేన్‌వార్న్‌లను ఎంపిక చేశాడు. విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా, టీమిండియా దిగ్గజం ద్రవిడ్‌, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వేస్‌ కలిస్‌, పాకిస్థాన్‌ దిగ్గజం వసీం అక్రమ్‌లను తన డ్రీమ్‌ టీమ్‌కు ఎంపిక చేశాడు.