వ‌న్డే సిరీస్ ద్వారా ధోని జ‌ట్టులోకిః శ్రేయాస్‌

shreyas iyer
shreyas iyer

జొహెన్న‌స్‌బ‌ర్గ్ః భారత క్రికెట్‌ జట్టు సారథి బాధ్యతలకు మహేంద్ర సింగ్‌ ధోనీ వీడ్కోలు చెప్పినా.. ఇప్పటికీ మైదానంలో కోహ్లీని వెనుక ఉండి నడిపిస్తున్నాడు. కోహ్లీ మైదానంలో ఫీల్డింగ్‌ కోసం ఎక్కడో ఉంటే బౌలర్లకు తానే ముందుండి సలహాలు ఇస్తూ మనకు ఎన్నోసార్లు కనిపించాడు. వన్డే సిరీస్‌ కోసం ధోనీ త్వరలో సఫారీ గడ్డపై అడుగుపెట్టబోతున్నాడు. ధోనీ జట్టులోకి వస్తున్నాడు.. అతని రాక జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీంతో సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌లో విజయం సాధించగలమనే నమ్మకం ఉంది అని అంటున్నాడు భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.
ఈ వారంలో ధోనీ, శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు ఆతిథ్య దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం ఎంపికైన ఆటగాళ్లు సఫారీ గడ్డకు పయనమవ్వనున్నారు. తాజాగా శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘టెస్టు సిరీస్‌ను కోల్పోయాం. ఈ ఓటమితో మా జట్టు ఏమాత్రం కుంగిపోదు. తిరిగి పుంజుకుంటాం. వన్డే సిరీస్‌ ద్వారా మహేంద్ర సింగ్‌ ధోనీ జట్టులోకి వస్తున్నాడు. గతంలో సఫారీ గడ్డపై జట్టును నడిపించిన అనుభవం ధోనీకి ఉంది. అతడు గొప్ప ఫినిషర్‌. వన్డే సిరీస్‌ దక్కించుకోవడంపైనే మా దృష్టి. ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం కూడా ఇదే’ అని అంటున్నాడు అయ్యర్‌.