వైల్డ్‌కార్డు ద్వారా రోజర్స్‌కప్‌కు షరపోవా

nlg 1
Sharapova

వైల్డ్‌కార్డు ద్వారా రోజర్స్‌కప్‌కు షరపోవా

న్యూఢిల్లీ: నిషేదిత ఉత్ప్రేరకం మెలోడియం వాడి డోప్‌ టెస్ట్‌ల్లో పట్టుబడి 15నెలలు టెన్నిస్‌కు దూరమైన అందాల తార ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ మరియా షరపోవాకు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు ఆమెకు వైల్‌కార్డు ఎంట్రీ ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్‌ ఓపెన్‌ కోసం ఆశగా ఎదురుచూసిన షరపోవాకు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా షరపోవాకు వైల్‌ కార్డు ద్వారా మరో ఎంట్రీ దక్కింది. నిషేదం ముగిసిన అనంతరం ఇప్పుడిప్పుడే టోర్నీల్లో పాల్గొంటన్న షరపోవాకి తాజాగా రోజర్స్‌ కప్‌లో పాల్గొనేందుకు వైల్‌కార్డు లభించింది. ఆగస్టు 5నుంచి 13వరకు ఈటోర్నీ టొరొంటోలో జరగనుంది. ఈసందర్భంగా టోర్నమెంట్‌ డైరెక్టర్‌ కర్ల్‌ హేల్‌ మాట్లాడుతూ మరియా గ్రాండ్‌స్లామ్‌ విజేత..ఎంతో మందికి అభిమాన తార..అని తెలిపారు. రోజర్స్‌కప్‌లో ఆడేందుకు కెనడా వెళ్లడానికి ఆశగా చూస్తున్నట్లు ఈసందర్భంగా షరపోవా తెలిపింది. గతంలో కెనడాలో ఎన్నో విజయాలు నమోదు చేశానని, అభిమానుల నుంచి ఎంతో మద్ధతు లభించినట్లు ఆమె గుర్తు చేసుకుంది. ఈఏడాది రోజర్స్‌ కప్‌ టోర్నీనే అతిపెద్ద ఈవెంట్‌గా భావిస్తు న్నానని, నాశక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తానని ఆమె తెలిపింది.