వెస్టిండీస్‌పై పాకిస్థాన్‌ విజయం

PAK TEAM
Pak Won The Match

వెస్టిండీస్‌పై పాకిస్థాన్‌ విజయం

యుఎఇ: టి20 ప్రపంచ కప్‌ విజేత వెస్టిండీస్‌ను వరుసగా రెండవ టి20లోనూ పాకిస్థాన్‌ ఓడించింది.కాగా యుఎఒ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 16 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుని మూడు టి20ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది.టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ పాక్‌ను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఓపెనర్‌ ఖలీద్‌ లతీఫ్‌ 36 బంతుల్లో 3 బౌండరీలు,1 సిక్సర్‌తో 40 పరుగులు చేయగా సర్పరాజ్‌ ఆహ్మాద్‌ 32 బంతులు ఆడి 5 బౌండరీలతో 46 పరుగులు,షోయబ్‌ మాలిక్‌ 28 బంతులు ఆడి 3 బౌండరీలు,1 సిక్సర్‌తో బ్యాట్‌ ఝుళిపించడంతో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగలిగింది.అనంతరం టార్గెట్‌ చేధనకు దిగిన వెస్టిండీస్‌ జట్టు పాక్‌ బౌలర్ల ధాటికి 9 వికెట్లకు 144 పరుగులకు పరిమితమైంది.టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైన విండీస్‌ జట్టు లో స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ 17 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్‌తో 30 పరుగుల చేయడమే జట్టులో ఎక్కువ స్కోరుగా నమోదైంది.కాగా తొలి టి20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ గెలిచిన విషయం తెలిసిందే.సిరీస్‌లో చివరి టి20 మంగళవారం జరుగనుంది.