విరాట్ స్థానంలో శ్రేయాస్ అయ్య‌ర్‌

shreyas iyer
shreyas iyer

బెంగ‌ళూరుః ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టు జట్టులో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చోటు దక్కించుకోనున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ అతని పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. జూన్ 14న ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌లో పాల్గొనే భారత బృందాన్ని సెలక్షన్ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ సందర్భంగా ముందస్తు ప్రాక్టీస్ కోసం విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళుతుండడంతో అతనిస్థానంలో అయ్యర్ ఎంపిక కానున్నాడు.