విరాట్ ఆట తీరు ప‌రిపూర్ణ‌త‌కు అద్దం: కోచ్‌

Ravi Shastri , Kohli
Ravi Shastri , Kohli

సెంచూరియ‌న్ః టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రవిశాస్త్రి తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రిపోర్టర్లకు పలు ఆసక్తికర చిట్కాలు కూడా ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 558 పరుగులు చేసిన చరిత్రాత్మక ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని పొగిడేందుకు మరో కొత్త పేరేదైనా ఉందా అని శాస్త్రిని ఓ విలేకరి అడిగాడు. శాస్త్రి మాట్లాడుతూ.. మీకో సలహా ఇస్తున్నాను. మీ స్థానంలో నేనున్నైట్లెతే రేపు ఏం చేస్తానో తెలుసా?. ఒక బుక్‌స్టోర్‌కు వెళ్లి కొత్తగా వచ్చిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని కొనుగోలు చేస్తాను. దీని ద్వారా కోహ్లీని ప్రశంసించేందుకు కావాల్సిన కొత్త పదజాలాన్ని నేర్చుకుంటానని సరదా వ్యాఖ్యలు చేశారు. తన పరిపూర్ణమైన ఆట అతన్ని ప్రస్తుత ఆటగాళ్లలో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టిందని కొనియాడాడు.