విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగింపు

hardhik pandya, kl rahul
hardhik pandya, kl rahul

ముంబై: టీమిండియా క్రికెటర్లైన పాండ్యా, రాహుల్‌లపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఆస్ట్రేలియా నుంచి తిరిగి భారత్‌కు రానున్నారు. ఆసీస్‌తో జరిగే రెండు వన్డేల నుంచే కాకుండా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది. పాండ్యా, రాహుల్‌లను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నాం అని సిఓఏ చైర్మన్‌ వినోద్‌రా§్‌ు వెల్లడించారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాండ్యా మాట్లాడుతూ..తనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని తన పేరెంట్స్‌తోనూ ,చెప్పానని అన్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పటికే అతడు క్షమాపణ చెప్పినా..అతని వివరణతో సిఓఏ సంతృప్తి చెందలేదు.