వికెట్‌ కీపర్‌గా టెస్టుల్లో రిషబ్‌పంత్‌ అరంగేట్రం

RISHAB PANT
RISHAB PANT

నాటింగ్‌హామ్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 12 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్‌ ధావన్‌(29), లోకేష్‌రాహుల్‌(10) లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో బుమ్రా, మురళీవిజ§్‌ు స్థానంలో ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. త్వరగా వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచుతామని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఈ టెస్టును గెలవడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.