వార్న‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేసే ఆట‌గాళ్లు ఉన్నారుః కోచ్‌

TOM MOODY
TOM MOODY

హైద‌రాబాద్ః కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరమైనా.. ఆ ప్రభావం జట్టుపై పెద్దగా ఉండబోదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయపడ్డాడు. వార్నర్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని చెప్పాడు. వార్నర్‌ గైర్హాజరీతో చాలా తక్కువ సమయంలో నాయకత్వ మార్పు జరిగినా దాని ప్రభావం అంతంత మాత్రమే అన్నాడు.