వారికి సరైన శిక్షే విధించారు

harbhajan singh
harbhajan singh

హైదరాబాద్‌: టివి షోలో ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వేటుకు గురైన ఇద్దరు క్రికెటర్ల అంశంపై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించారు. వారిపై వేటు వేసి బిసిసిఐ సరైన నిర్ణయమే తీసుకుందన్నారు. ఇలాంటి క్రికెటర్లు తమ మధ్యలో ఉంటే ఇంక ఫ్యామిలీలతో ఎలా ప్రయాణిస్తామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను ఒకే కోణంలో చూడటం సరికాదని, ఫ్యామిలీ ఉన్నపుడు ఇలాంటి వాళ్లను ప్రోత్సహించలేమని భజ్జీ తెలిపాడు. ఇలాంటి విషయాలను స్నేహితులతో కూడా మాట్లాడమని, అలాంటిది వీరు ఏకంగా టివి షోలో మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. టివిల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే టీం గురించి ప్రజలు తప్పుగా అనుకునే ప్రమాదం ఉందని అన్నారు. ఒక్కరి గురించి అందరినీ అపార్ధం చేసుకునే అవకాశం ఉందన్నారు. వారికి సరైన శిక్షే విధించారని సమర్ధించాడు.