వరల్డ్‌కప్‌కు కోహ్లి డిమాండ్లు

VIRUSHKA
VIRUSHKA

ముంబై: వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్‌కప్‌కు వెళ్లేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ముందు కొన్ని డిమాండ్లను ఉంచాడు. వరల్డ్‌కప్‌ ఆడే సమయంలో తమకు అరటిపండ్లు ఇవ్వాలని , ప్రత్యేకంగా రైల్వే కోచ్‌ కేటాయించాలని, తమతో పాటు భార్యలను కూడా అనుమతించాలని టీమ్‌ కోరుకుంది. గత ఇంగ్లండ్‌ టూర్‌లో ప్లేయర్స్‌కు అరటిపండ్లు ఇవ్వలేదని వారు ఈ డిమాండ్‌ను బిసిసిఐ ముందుంచారు. ప్లేయర్స్‌కు బుక్‌ చేసే హోటళ్లలో సరైన జిమ్‌ వసతులతో పాటు భార్యలను వెంట తీసుకెళ్లడానికి ఉన్న ప్రోటోకాల్‌పైన బోర్డు వర్గాల సమావేశంలో చర్చకు వచ్చింది. వరల్డ్‌కప్‌ సందర్భంగా రైళ్లలో ప్రయాణించాలని ఉందని ప్లేయర్స్‌ చెప్పగా భద్రతపై సీఓఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐతే షరతులతో కూడిన ఒప్పందాన్ని సిఓఏ అంగీకరించింది.