వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా కైవసం

s7
SA Team

వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా కైవసం

సెంచూరియన్‌: ఐసిసి వన్డేటీమ్‌ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకోవడంతో సఫారీ ఈ ఘనత అందుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదవ వన్డే సెంచూరియన్‌లో జరిగింది.ఈ మ్యాచ్‌లో దక్షిణాప్రికా 88 పరుగులతో గెలుపొందింది.మొదట బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు టార్గెట్‌ను చేరుకున్న క్రమంలో పర్యాటక జట్టు కేవలం 296 పరుగులు చేసి పరాజయం పాలైంది.

శ్రీలంక సిరీస్‌ ఆరంభానికి ముందు నాలుగు పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియా వెనక ఉంది.ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటకు వెళ్లిన ఆస్ట్రేలియా 0-2తో సిరీస్‌ కోల్పోగా తాజాగా శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేయడంతో అగ్రస్థానం సఫారీల సొంత మైంది.2016 మే 1 నుంచి దక్షిణాఫ్రికా 17 వన్డేలు ఆడగా 13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.2014 తరువాత వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా మొదటి స్థానాన్ని చేరడం ఇదే తొలిసారి.2002లో ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి టాప్‌ ర్యాంకుకు చేరడం ఇది అయివసారి.భారత్‌ 112 పాయిం ట్లతో నాలుగవస్థానంలో ఉండగా,న్యూజిలాండ్‌ 113పాయింట్లతో మూడవ ర్యాంకులో కొనసాగుతుంది.