ర్యాంకును మెరుగు పరుచుకున్న పాక్‌

Team-1
Team-1

ర్యాంకును మెరుగు పరుచుకున్న పాక్‌

ఇస్లామాబాద్‌: ఎలాంటి అంచనాలు లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీలో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ టోర్నీ టైటిల్‌ను ఎగురేసుకపోయింది. గత కొంత కాలంగా వన్డే ర్యాంకింగ్‌లో జాబితాలో టాప్‌-8లో నిలిచినజట్లుఈటోర్నీకి అర్హత సాధిం చాయి. ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచి టోర్నీలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ గ్రూప్‌ దశ దాటుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ…తమ ప్రదర్శన ఎవరి అంచనాలకు అంద దని మరోసారి పాక్‌ నిరూపిస్తూ టాప్‌-4లో ఉన్న మూడు జట్లని ఓడించి టైటిల్‌ని గెలుచు కుంది. ఈటోర్నీలో ఐదుమ్యాచ్‌లాడి నాల్గింటిలో విజయం సాధించిన పాకిస్తాన్‌ తాజాగా ఐసిసి ప్రకటించిన వన్డే ర్యాంకింగ్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరోస్థానానికి ఎగబాకింది. ఫైనల్లో ఓడిన భారత్‌ మూడో స్థానంలో నిల వగా…అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా నిలిచాయి. సెమీస్‌లో పాకిస్తాన్‌ చేతిలో పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌: 1. దక్షిణాఫ్రికా (119 పాయింట్లు), 2. ఆస్ట్రేలియా (117), 3. భారత్‌ (116) 4. ఇంగ్లాండ్‌ (113), 5.న్యూజిలాండ్‌ (111), 6.పాకిస్తాన్‌ (95), 7. బంగ్లాదేశ్‌ (94), 8. శ్రీలంక (93), 9. వెస్టిండీస్‌ (77), 10. ఆప్ఘనిస్తాన్‌ (54).