రోహిత్‌శర్మను అధిగమించిన మిథాలీరాజ్‌

mithali raj
mithali raj

గయానా: అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్‌ (56; 47బంతుల్లో 7ు4) అర్ధశతకంతో రాణించింది. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ(2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) అందరి కంటే ముందు వరుసలో నిలిచింది. అంతేకాక మరో రికార్డుతో ఆమె పరుషుల క్రికెట్‌లో భారత్‌ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ (2,207పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) రికార్డును అధిగమించినట్లయింది