రిషబ్‌ పంత్‌కు గంగూలీ సూచన

rishab panth
rishab panth

కోల్‌కతా: యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ పవర్‌ హిట్టింగ్‌ చేస్తూ తరచూగా భారీ షాట్లు ఆడుతుంటాడు. అయితే కొన్ని సార్లు వినూత్నంగా రివర్స్‌ స్కూప్‌ ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు.ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ దినేశ్ కార్తీక్‌తో కలిసి దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ చివర్లో పేలవంగా ఔటవడంతో మ్యాచ్ భారత్‌ చేజారింది. దీని గురించి గంగూలీ మాట్లాడుతూ.. దినేశ్ కార్తీక్‌తో కలిసి చివరి దాకా నిలిచి పంత్ మ్యాచ్‌ని గెలిపించి ఉండాల్సింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతను‌ మ్యాచ్‌ను దాదాపు భారత్‌ చేతుల్లోకి తెచ్చేశాడు. కానీ ఒక్క పేలవ షాట్‌ కారణంగా మొత్తం అతని ప్రదర్శనకే విలువ లేకుండా పోయింది. పంత్ లాంటి యువ ఆటగాడికి షాట్ల ఎంపిక విషయంలో జట్టులో ఎవరైనా తగిన సూచనలు అందించాలి. ఇలాంటి పేలవ షాట్లు అనవసరమని వివరించాలి. ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే షాట్ ఎంపిక విధానం మార్చుకోవాలి. అదేమీ పెద్ద కష్టంతో కూడుకున్న పనేమీ కాదు.గ అని గంగూలీ చెప్పాడు.