రాహుల్‌, పాండ్యాల సస్పెన్షన్‌!

kl rahul, hardhik pandya
kl rahul, hardhik pandya

ముంబై: టీమిండియా క్రికెటర్లు హార్ధిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహల్‌లు ఓ టివి షోలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వారిని సస్పెండ్‌ చేసే దాక వచ్చింది. వారిని సెస్పెన్షన్‌ చేసేందుకు బిసిసిఐ లీగల్‌ సెల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బిసిసిఐ రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు లీగల్‌ సెల్‌ చెప్పింది. ఈ వ్యవహారం బిసిసిఐ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కిందికి కూడా రాదని లీగల్‌ సెల్‌ అభిప్రాయపడింది. దీని ప్రకారం ఫీల్డ్‌లో జరిగిన తప్పిదాలే కాక బయట కూడా మ్యాచ్‌ లేదా ప్లేయర్స్‌, టీమ్‌, సపోర్టు స్టాఫ్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రమే ఈ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కిందికి వస్తుంది. ఐతే వీరు ఓ టివి షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.