రాహుల్‌ ఎంపికపై అభిమానుల సీరియస్‌!

kl rahul
kl rahul

సిడ్నీ: విరాట్‌ కోహ్లి కెప్టెన్‌ ఐన తర్వాత టీమిండియా విజయాలైతే సాధిస్తున్నది కానీ తుది జట్టు ఎంపికపై మాత్రం ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్‌ జట్టు సభ్యులను మార్చటం అలవాటుగా మారిపోయింది. రేపు ఆసీస్‌తో జరగబోయే నాలుగో టెస్టుకు టీమిండియాలో కేఎల్‌ రాహల్‌కు బిసిసిఐ చోటు కల్పించింది. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యారనే ఓపెనర్లు విజ§్‌ు, రాహుల్‌లను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఐతే నాలుగో టెస్టులో రాహుల్‌కు మరో ఛాన్స్‌ ఇచ్చారు. దీంతో అభిమానులు ట్వీట్టర్‌లో కోహ్లి, శాస్త్రిలపై మండిపడుతున్నారు. టీమ్‌ ఎంపిక చేయడానికి మంచి ప్రదర్శన ప్రామాణికం కాదా అని ఒకరు, కోచ్‌ ఫేవరేట్‌ ఐనంత మాత్రాన సరిపోదు అని ఇంకొకరు, అందరూ కష్టపడి తుది జట్టులో చోటు సంపాదించాల్సిందేనని అభిమానులు ట్వీట్‌ చేశారు.